Saturday, July 30, 2011

ప్రణామాలు


ప్రజాక్షేత్రంలో......
సామాన్యుడిని సాహసిగా
నిలిపినవాడు
యుద్ధరంగంలో
గులకరాయిని బుల్లెట్ గా
...... మార్చినవాడు
సాహితీ క్షేత్రంలో
పైడికంటిని,గోగురిచ్చను
పరిచయం చేసినవాడు
చివరగా
పరాజితుడినే విశ్వ విజేతగా
రణరంగాన్ని మార్చినవాడు
ఏడీ!
ఆ మూర్తి...... సత్యమూర్తి
అతనికి నా దండ ప్రణామాలు.

1 comment:

  1. కాకాని గారు మీ కథ 'మహారాజు - గుడ్డివాడు' చాలా ఆసక్తిగా సాగింది. ఒక్క ఉదుటున చదివేందుకు ఉద్యుక్తుణ్ణి చేసింది. కాకపోతే అక్కడక్కడ ఆంగ్లపదాలు, ఉదాహరణకి 'మ్యూల్, హిన్ని' వంటివి, పంటికింద పలుకుల్లాగా అనిపించాయి. ఏదేమైనప్పటికి అభినందనీయులు
    ఇట్లు
    ఎం.బి.తిలక్
    హైదరాబాద్

    ReplyDelete