ఈదేశంలో ప్రభుత్వాలు మార్కెట్ కొరకు, మార్కెట్ చేత, మార్కెట్ ల వల్లనే కొనసాగుతున్నై అంటే పూర్తిగా అతిశయోక్తి కాదు కాక కాదు. అంటే ఇక్కడ మార్కెట్ కు ధరల గురించి పూరాగా తెలుసు. అయితే విలువల గురించే ఏమీ తెలియదు కాక తెలియదు.
ప్రపంచంలో జరిగిన జరుగుతున్న పరిణామాలను ఒక్కసారి మనం గమనిస్తే సోవియట్ యూనియన్ కుప్ప కూలి పోయిన తర్వాత చైనాలో నూతనం గా పెట్టుబడిదారీ వ్యవస్థ పురుడు పోసుకుంటున్న కాలంలో ........ భారత దేశంలో నిరుపేదల వాస్తవ స్థితి బాగా దిగజారింది. ఇంక పెట్టుబడిదారీ విధానానికి ముసుగులు అవసరం లేకుండా పోయింది.పెట్టుబడిదారులు తమ తమ ఆస్తులను మరింతగా ప్రోది చేసుకునే క్రమంలో అతి దుర్మార్గామయిన దోపిడీ పద్దతులు అవలంభించేందుకు వారికిప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా పోయాయి. సరిగ్గా ఇవి పెట్టుబడిదారీ విధానం పుట్టిన తొలిరోజుల్లో పెట్టుబడిదారులు అవలంభించిన పద్దతులే.
No comments:
Post a Comment