Saturday, August 21, 2010

మంచితనానికి నిలువెత్తు మనీషి పొదుగు ఆనంద్

ఆంధ్రాబ్యాంక్ జవ్వారుపేట(మచిలీపట్టణం) బ్రాంచ్ మేనేజరు శ్రీ పి.ఆనంద్ మనిషి ఎంత ఎత్తో మంచితనం విషయంలో కూడా అంతే ఎత్తు అనడానికి ఎటువంటి సందేహం వలదు .ఖాతాదారులకు సర్వీస్ చేసే విషయంలో బ్యాంకులలో కెల్లా ఆంధ్రాబ్యాంకు మేటి. ఆంధ్రాబ్యాంక్ మేనేజర్లలో కెల్లా పి.ఆనంద్ కు సాటిలేరు ఎవరు.ఒక్కసారి బ్యాంకులోకి వచ్చిన ఖాతాదారు డిపాజిట్ కు సంభందించిన/ రుణానికి సంబందించిన ఏ విషయం అయినా అడిగితే " కాదు " అనే సమాదానం ఆనంద్ నోటి వెంట రాదు అంటే అతిశయోక్తి కాదు. ఏదయినా సరే చేద్దాం అని సహజంగా , సింపుల్ గా అంటారు. అట్లా కాకుంటే మాపయ్ ఆఫీసు వారిని కనుక్కుంటాను కొంచం సమయం పడుతుంది అంటారు. ఆర్ధికరంగం మరీ ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేసేవారి ఆలోచనలు కాబూలీ వాని సరళి లోనే ఉంటాయంటే అంత అతిశయోక్తి కాదు.అప్పు వడ్డీకి తెచ్చేదీ వారే , వడ్డీకి అప్పు ఇచ్చేది వారే అయితే డిపాజిట్లపయ్ తక్కువ వడ్డీ, అప్పు ఇచ్చేటప్పుడు వడ్డీ రేటు ఎక్కువ. ఈ రెండింటి మధ్య వ్యతాసంతో సిబ్బందిజీతభత్యాలు, అద్దెలు, కరెంటు ఖర్చులు,ఇతరేతర ఖర్చులు, ఇవన్నీ పోను లాభాలు గడించాలి. ఇది సామాన్య బ్యాంకింగ్ సూత్రం. ఇలాంటి రంగంలో మేనేజర్లుగా కీలక భూమిక పోషిస్తూ బ్యాంకులోకి వచ్చే ఖాతాదారులను అందరిని సంతృప్తి పరచడం అంటే అంత తేలికయిన విషయం కాదు. అయిన ఆనంద్ గారు ఎవ్వరిని నొప్పించక తోటి సిబ్బందిని సయితం ఇబ్బంది పెట్టకుండా ఇరకాటంలో పెట్టకుండా చిన్న పాటి రిక్వెస్ట్ తోటి అందరిని సంతృప్తి పరుస్తారు.ఆ రిక్వెస్ట్ ఆదేశంలా కాకుండా సూచనాపూరిత నివేదనలా వుండి సిబ్బంది బాధ పడకుండా పని పూర్తి చేస్తారు. ఖాతాదారులూ సంతృప్తిగా బ్యాంకు నుంచి బయటకు వెళతారు.నిలువెత్తు మనీషి ఆనంద్ గారు బ్రాంచ్ లో పని చేసే ఆఫీసర్, ఆఫీసరేతర సిబ్బందిని అందరిని తన దగ్గర పని చేసే వారని కాకుండా తనతో కలసి పనిచేసేవారని భావించి వారిలో ఒకరిగా కలసిపోతారు.ఇది ఆనంద్ విజయ రహస్యంగా చెప్పుకోవచ్చు. సహజంగా మేనేజర్లకు వుండే భేషజం లేకుండా ఆనంద్ అందరితో కలివిడిగా వుండటం వల్ల ఎవరికి వారే ఆనంద్ ను తమ మనిషిగా ఫీల్ అవుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ విధమయిన ఆఫీసు వాతావరణం వలన అభిప్రాయభేదాలకు తావులేకుండా బ్రాంచ్ యావత్తు సిబ్బంది సరదాగా వుండి పని త్వరగా పూర్తి చేస్తారు.
పొదుగు ఆనంద్ మనిషిగా మంచి ఎత్తు అలాగే ఉన్నత భావాల విషయంలోను మరింత వున్నతుడే. ఎత్తయిన మనీషి సమున్నతమైన భావాల కలగలుపే పి.ఆనంద్ అంటే అతిశయోక్తి కాదు. ఆనంద్ లో సహజం గా వుండే మంచితనం,మర్యాద, మానవత్వం,ఇతరులను త్వరగానమ్మేతత్వం,ఆర్ధిక, హార్దిక, సహాయ, సహకారాలు అందించే విషయం లో మరే ఇతర మనిషి ఆయనకు సాటి లేరు/రారు. అనటానికి సందేహం వలదు. సహజంగా నేటి సమాజంలో ఇట్లాంటి దయార్ద్ర హృదయం వున్నా వారు మోసపోవడం, నష్టపోవడం జరుగుతుంది. బహుశా ఆనంద్ కు కూడా ఈ అనుభవాలు వుండే వుంటాయి.అయినా ఏనాడు నోరు విప్పి ఆనంద్ తనకు జరిగిన నష్టానికి, కష్టానికి, కారకులయిన వ్యక్తులను కించ పరుస్తూనో,విమార్సిత్స్తూనో, ఎవరి ముందరయినా తిడుతోనో/ చేపుతూనో ఉన్నసందర్భమే వుండదు. ఎక్కడ ఏ బ్రాంచ్ లో పని చేసిన ట్రా న్స్పెర్ అయి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇంకొంత కాలం ఆనంద్ గారు వుంటే బాగుండేది. అని అందరు అనుకునేట్టు ఆయన ప్రవర్తనా సరళి వుండేది అంటే అతిశయోక్తి కాదు.
ఉన్నత వ్యక్తిత్యానికి సమున్నత
ఐకాన్........పొదుగు ఆనంద్

No comments:

Post a Comment