Tuesday, June 29, 2010

నాకు నచ్చిన పాలస్తీనా కధ..........." తీర్పు." --ఘసన్ కన్ఫానీ .

సర్వే అధికారి వచ్చి తనకున్న కొద్దిపాటి భూమిని కొలిచి తన రిజిస్టర్ లో వ్రాసుకొని దానికి కారణం ప్రభుత్వానికి,ఇబ్రహం ఎల్హమీద్ కు మధ్యగల 'వివాదమే'నని చెప్పినప్పుడు హమీద్ ఏ మాత్రంపెట్టలేదు. పైగా రిజిస్టరు చేసుకోవయ్యా,చేసుకో!కలము కాగితము కన్నా మరేదీ చౌకగా లేదు- నేను మాత్రం నా పొలాన్ని
ఇచ్చేది లేదు. అని గట్టిగ చెప్పాడు.
దాదాపు ఏబయ్ ఏళ్ళుగా తను ఆ పొలం ఎరుగును.తను చిన్న పిల్లడుగా వున్నప్పుడు
ఆ పొలం పనులలో తండ్రికి చేదోడు వాదోడుగా.వుంటూ ఉండేవాడు.తండ్రి మరణానంతరం తనే ఆ పొలాన్ని
సాగు చేయసాగాడు.అదే విధంగా ఇప్పుడుకూడా పొలాన్ని దున్ని సాగు చేసుకుంటున్నాడు.
రోజులు దొర్లుతున్నాయి దాదాపుగా ఒక ఏడాది కాలం గడిచింది.ఆ వివాదాస్పద మయిన
భూమి విషయమై హైఫా లోని కోర్టులో హాజరు కావలసిందిగా తనకు తాకీదు అందేంతవరకు ఆ సర్వే
ఆఫీసరు రికార్డు చేసిన విషయాన్నే మరిచిపోయాడు హమీద్.విచారణ రోజున తన చిన్నకొడుకును వెంట
పెట్టుకొని హైఫా లోని కోర్టుకు హాజరయ్యాడు.అబ్దుల్ హమీద్,అబ్దుల్ హమీద్,అబ్దుల్ హమీద్, మూడు సార్లు కోర్టు జవాను గాడిదలా ఓండ్రపెట్టాడు. హమీద్ కోర్ట్ హాలులో అడుగు పెట్టాడు.విచారణ మొదలయ్యింది.
ముగ్దేల్ కురం ప్రాంతంలో గల 48 వ నంబరు భూమికి 1967 కి పూర్వం నీవే హక్కు దారువని, యజమానివని రుజువు పరచుకోగలవా?-- జడ్జి ప్రశ్నించాడు. హమీద్ ఇలా జవాబు ఇచ్చాడు. " అవునండి అయ్యగారు!నేను ఆపొలాన్ని మా తండ్రి గారి నుండి వారసత్వంగా పొందాను. నా తండ్రిగారి,మీ తండ్రిగారి ఆత్మలకు శాంతి చేకూర్చవలసిందిగా ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను.

" నీ చెత్త వాగుడు కట్టిపెట్టు.నీ తండ్రి గొడవ ఇక్కడ ఎందుకు?నీ వాదనను రుజువు పరచుకోవటానికి నీ దగ్గర ఏమయినా దాఖలాలు, రుజువు పత్రాలు ఉన్నాయా?" జడ్జిగారు గాండ్రించారు.
కొంచంసేపాగి హమీద్ ఇలా అన్నాడు--అయ్యా, నేను మళ్ళి మళ్ళి చెబుతున్నాను.దాన్ని నేను మా తండ్రిగారి నుండి పొందాను.నా15 వ ఏట నుండి నా తండ్రి తో కలసి ఆ నా పొలాన్ని సేద్యం చేసాను.
" ఇది రుజువు క్రిందికి రాదు." జడ్జిగారింకా ఇలా అన్నారు--సరే ఆ పొలంలో అరవయ్ శాతం రాళ్ళ మయం. కాబట్టి అది ప్రభుత్వ ఆస్తి అవుతుంది.( నిధులు, నిక్షేపాలు,ఖనిజసంపద వున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు.రాళ్ళు కూడా ఖనిజ సంపద క్రిందకు వస్తుంది.)
" ఏంటి?-- అరవయ్ శాతమా,డెబ్భై శాతమా? ట్రాక్టరు ఒక్క దెబ్బకు దున్ని అవతల పారేస్తుంది. అయ్యా! ఒకటి అరా రాళ్ళు వుంటే ఉండవచ్చు-- కానీ ఒక్కొక్క రాయి నుండి ఒక్కొక్కద్రాక్ష తోట ను పండించవచ్చు. అదేమీ వట్టి పోయిన భూమి గాదు. మా తండ్రిగారు తన జీవితాన్నంతా ఆ ఉన్న నాలుగు రాళ్ళు ఎరివేసేందుకే అంకితం చేసాడు. నేను అదేచేస్తున్నాను. అయినా అంతగా ప్రభుత్వం కావాలనుకుంటే నా పొలం తప్ప మరేమీ కనబడలేదా?" దాదాపు అరచినట్లుగా ప్రశ్నించాడు హమీద్.
దానితో జడ్జిగారి కోపం తారస్థాయికి చేరుకొంది."ఇటువంటి చెత్త వాగుడు కట్టి పెట్టవలసిందిగా మరో సారి హెచ్చరిస్తున్నాను.ఇతరుల ఆస్తిని ప్రభుత్వం అనవసరంగా ఆక్రమించదు.అది దాని భాద్యత కూడా" అంటూ తీవ్రంగా హెచ్చరించాడు.
" హక్కా?-- భాధ్యతా?"--- వ్యంగ్యంగా అన్నాడు ... హమీద్ . "అయ్యా, ప్రభుత్వం చాలా బలమైనదని నాకు తెలుసు. నాకేమున్నది .... నాలుగెముకులు, కాస్త కండ తప్ప,అటువంటి నాపైన ప్రభుత్వం కలియబడటం........"
" ఏయ్ మనిషి ఇటు చూడు. నువ్విప్పుడు కోర్టులో వున్నావు.అర్ధం లేని పిచ్చి వాగుడు వాగకు".జడ్జి గారు మరోమారు హెచ్చరించి కొంచంసేపాగి ఇలా అన్నారు---సరే ప్రభుత్వం సగంపాలు తీసుకొని మిగతా సగం నీకే ఇచ్చేస్తుంది.దీనికేమంటావు?
హమీద్ తల అడ్డంగా త్రిప్పుతూ " అయ్యా! నాకు ప్రభుత్వం అనే అన్నయ్య ఉన్నట్టుగా కానీ, వాడితో ఇలా వాటా పంచుకోవాలనిగాని మా నాన్న నాకెప్పుడూ చెప్పలేదే!" అన్నాడు.
జడ్జిగారు సహనం కోల్పోయారు---"ఇదిగో ముసలాడా!ఈ నిర్ణయానికి నీవు కట్టుబడి వుండటం సమంజసంగా వుంటుంది.సమాధానం సూటిగా చెప్పు. దీనికి నీవే మంటావు". అంటూ తీక్షణంగా చూసాడు హమీద్ వంక.
"భగవంతుని సాక్షిగా చెబుతున్నాను." అయ్యా! మీ తీర్పు ఏడ్చినట్టుగా వుంది. చాలా చాలా దారునంగాను, చీకటిలా భయంకరంగాను వుంది." అంటూ బోను దిగి " అన్యాయమైన తీర్పు ఎంతో కాలం జీవించదు." అని గొణుక్కుంటూ, తన చేతికర్ర పోటేసుకొంటు తన చిన్న కొడుకు తోడుతో వెళ్ళిపోతున్నాడు.
ఇబ్ర్హం ఎల్ హమీద్.
__ __సూర్యుడు పశ్చిమాద్రిన అస్తమిస్తున్నాడు. రేపు తిరిగి తూర్పున ఉదయించడానికి.__ __

Saturday, June 26, 2010

. జరీ------ పమిటలు

కాయకష్టం చేసే మహిళలకు
చెమట సారికలే జరీ ఫైటలు.

కర్ణ ------ దుర్యోధన -----బంధం

ఎవరయినా చేసిన పని పట్ల ఒకేసారి జాలి, అసహ్యము కలిగితే
ఆ స్థితి ని కర్ణ దుర్యోధన సంబంధం అంటారు.

Friday, June 25, 2010

పెద్దరికం *** వృద్దతరం *** యువతరం *** సవాల్

పెద్దరికం కోసం, నాయకత్వం కోసం, పడచుదనం పాతతరాన్ని సవాల్ చేస్తుంటది. గతంలో చేసింది,
వర్తమానంలో చేస్తూంది. భవిష్యత్తులో చేస్తది.
అధికారానికీ అదిచ్చే సౌకర్యాలకీ అలవాటుపడ్డ వృద్దతరం తనకు తానుగా వాటిని వదులుకోదు గాక వదులుకోదు.
కొత్త (యువ) తరం సవాల్ చేసి సాధించాల్సిందే, అధవా యువతరం ఆ విధంగా సాధించలేకపోతే ముదివీ, మృత్యువు యువతరం కోసం సాధించిపెట్టటం మనం చూస్తుంటాం.

Thursday, June 24, 2010

డాక్టర్. వి.లక్ష్మణరెడ్డి—-అధ్యాపక శ్రామికుడు.

నిరంతర అధ్యయనం చేయందే అధ్యాపక ఉద్యోగానికి అర్ధం లేదనే భావనతో, నిరంతరం అధ్యయనం చేస్తూ
అధ్యాపక వృత్తికే వన్నె తెచ్చి వయసురీత్యా ఉద్యోగ విరమణ చేసి అధ్యయనాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్న
డాక్టర్.వి.లక్ష్మణ రెడ్డి గారు నాకే కాదు మా తరానికే స్పూర్తి ప్రదాత.
డాక్టర్.లక్ష్మణ రెడ్డి గారు బుద్దవరం వి.కే.ఆర్.కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా పని చేసి పదవీ విరమణ చేసారు. ముఖ్యంగా డాక్టర్. రెడ్డి గారు పదవీ కాలంలో పాఠం చెప్పే విధానం,ఉచ్చారణ,విశ్లేషణ,
ఉపన్యాస సరళి విద్యార్ధులుగా మమ్ముల్ని ఎంతగానో ఆకట్టుకొనేది.రెడ్డి గారు పాఠం చెప్పేటప్పుడు విన్న
ఏ విద్యార్ధి కూడా తిరిగి ఆ పాఠం చదవ వలసిన అవసరం లేకుండానే పరీక్షలు వ్రాయగలిగేవారు.
మా రెడ్డి గారు పాఠంతో పాటు సామాజిక,రాజకీయ,ఆర్ధిక,సాంఘిక,సాంస్కృతిక,సమకాలీన,
విషయాలను కలగలిపి, రంగరించి,వివరించి,విశ్లేషించి మా నాలెడ్జిని అప్టుడేట్ చేసేవారు. ముఖ్యంగా మా
మాస్టారి భోధనా విధానం మిత్రులుతో ముచ్చటిస్తున్నట్లు ఉండి పాఠం ఉపదేశం వలె గాక ఆలోచన రేపే
విధంగా ఉండేది.ఆ ధోరణి మా అధ్యయనానికి, మా వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడి ,మాలో ఆలోచన, అన్వేషనాసక్తిని రేకెత్తించేది.
మా లక్ష్మణ రెడ్డి గారు తన పదవీ కాలంలో ఎందరో నరసింహాలను నరులుగా, మానవత్వం వున్న మానవులుగా, ఎందరో హనుమంతులను సద్యోజనిత చైతన్యవంతులుగా ( వెదురు బొంగును వేణువు గా మార్చినట్లు) మలచిన వాస్తవిక అధ్యాపక కార్మికుడు. గన్నవరం ప్రాంతంలో జనం అందరికి సుపరిచితులయిన మా డాక్టర్.వి.లక్ష్మణ రెడ్డి గారిలో చొరవ పాలు హెచ్చు. మిత్రులారా! మీలో ఎవరికైనా ఆసక్తి వుంటే మా మాస్టారిని ౦౪౦-౩౧౫౦౯౫౪ లో హలో చెప్పి నడుస్తున్న సమకాలీన వివాదాస్పదం కాని విషయాలు మాట్లాడి మీరే గ్రహించగలరు.

Wednesday, June 23, 2010

తెలంగాణా పల్లెల్లో దూల - సాంస్కృతిక రూపం

బాధితుల్నే నేరస్తులుగా చిత్రీకరించే వ్యవస్థను ప్రతిబింభించే
పాట తెలంగాణా పల్లెల్లో పిల్లలు దూల అనే ఒక సాంస్కృతిక
రూపకం లో పాడుతుంటారు.
దున్నపోతు! దున్నపోతు!
దుక్కేందుకు దున్నలేదు?
పాలేరు కాడి కట్టందే
దుక్కేట్లా దున్నేది?
పాలేరు!పాలేరు!
కాడెఎందుకు కట్టలేదు?
దొరజీతమియ్యలె
అందుకే దుక్కికాడికట్టలే
దొర! దొర! జీతం ఎందుకీయలేదు?
సోలలేందే నేనెట్ల కొలిచేది?
సోల! సోల! ఎందుకు లేవు?
వడ్లాభక్తుడు చేయందే
నేనెట్ల వుంటాను?
వడ్లాభక్తుడా! వడ్లాభక్తుడా!
సోల నెందుకు చెక్కలా?
బాడిసె చేక్కందే
నేనేం చేసేది?
బాడిసె! బాడిసె! ఎందుకు
చెక్కలేదు?
కమ్మరోడు సరవందే
నన్నెట్లా చెక్కమంటావు?
కమ్మరోడా! కమ్మరోడా!
బాడిస నెందుకు సరవలేదు?
తిత్తి ఊదన్దె నేనెట్లా సరిసేది?
తిత్తీ! తిత్తీ!ఎందుకు
ఊదలేదు?
దున్నపోతు చావందే
నన్నేం చేయమంటావు?

వక్రబుద్ధి కత్తికి రెండు అంచులా పదును వుంటుంది. గుర్తుంచుకోండి.

Monday, June 21, 2010

భూదేవి ........ వందనం.

ఉదయానే లేచి పవిత్రభూమిఫై కాళ్ళు పెట్టబోయే ముందు
భూమాతను క్షమాపణ అడగడం ఉత్కృష్ట మయిన
భారతీయ సంస్కృతి.
" నమస్తుభ్యం పాదస్పర్సం క్షమస్వమే."

ద్రౌ పది ------ గాంధారి --------అనుమతి.

అరణ్యవాసానికి వెళ్లబోయే ముందు ద్రౌ పది, గాంధారి అనుమతి కోసం
వెళ్ళినప్పుడు ........................ గాంధారి

" తల్లీ, నువ్వు ఎక్కడ ఉంటె అక్కడ విజయం వుంటుంది. నీ బట్టలు
ఊడదీసి నా బిడ్డలు అమంగళం నెత్తి నెత్తుకున్నారు. నీవు, అవమానభారం తో
వెళుతున్నావు. నిజానికి నీవు విజయంతో మాత్రమే కాక, నా కోడళ్ళ పసుపు
కుంకుమలను కూడా తీసుకుపోతున్నావు ". అంది.
ఒక మానవతి వలువలు వూడ్చిన ఫలితంగా జరిగినదేమిటో
మనందరికీ తెల్సిందే.

కరువు

ఆకలి ని దాహం తో హేచ్చిస్తే వచ్చే ఫలితం= కరువు
ప్రజలకు కరువు అంటే వంచకునికి సంపద.

Sunday, June 20, 2010

పెళ్లి

శుబ్రంగా పెళ్లి చేసుకో పెళ్ళాం అనుకూలవతి
అయితే సుఖపడతావు. లేకపోతే
వేదాంతివి అవుతావు.------ సోక్రటిస్

పెళ్లి జోలికి పోకుండా అతగాడు ఒంటరిగా మిగిలిపోయాడు.
అది అతని ఇష్టం. ఒంటరిగా ఉండలేక ఇతగాడు
పెళ్లి చేసుకున్నాడు. ఇది ఇతని ఖర్మం.--- రాబుర్ట్ బర్టన్.

పెళ్లయినవాడు ఏపనయిన ధైర్యంగా చేయగలుగుతాడు
అయితే
వాళ్ళావిడ ఒప్పుకుంటే -----------జార్జి బెర్నాడ్ష

ఒక్కడినే ఉండలేను ఇంత ఎత్తు ఎగారలేను
ఎవరేనా తోడురండి. జీవితాన్ని పంచుకోండి. అంటూ
జీవితంలోకి భాగస్వామిని ఆహ్వానించేవారే ఎక్కువమంది.
అయితే
మినర్వా పెళ్లి జోలికి పోలేదు కాబట్టే తెలివి తేటలకు
ఆదిదేవత అయింది. అనే ఒంటరి జీవులు లేకపోలేదు

జనం నేత

నీవు నడవాలంటే
మెదడు ఉపయోగించు కానీ

నీ వెంట జనం నడవాలంటే
హృదయంతోనే సాధ్యం

పెద్దమనుషులు

పగవాడిచేత పామును కొట్టించే పెద్దమనుషులు కొందరు.

ఊరుసొమ్ముతోటి రామమందిరం కట్టించి సొంతసొమ్ము
తోటి చెక్కభజన చేయించే పెద్ద మనుషులు మరికొందరు.

ప్రశ్న

ప్రశ్నలు వేసుకునే శక్తీ వల్లనే మానవులు
ఈనాటి స్థితికి చేరుకున్నారు.
ప్రశ్నలు వేసుకునే మనోభలం
కోల్పోయిన వ్యక్తులు భ్రమలకు లోనవుతారు.

విశ్వాసాలు కాళ్ళను బుద్ధినీ
బందిస్తాయే కాని నడిపించవు

ఏడుపు గొట్టు ముఖాలకు నవ్వంటే మా చెడ్డ భయం.

పాండవుల కండబలానికి , కత్తులూ, కటారులకి, భయపడని దుర్యోధనుడు
పాంచాలి నవ్వు కి భయపడతాడు.

నియంత హిట్లర్ వెయ్యి మర ఫిరంగులకు భయపడడు. ఒక్క
చార్లీచాప్లిన్ నవ్వుకు గుండె ఆగి చస్తాడు.

ఫ్రీమార్కెట్ ------ కెరీర్ ------- పోటీ---పరుగు.

పుట్టిన దగ్గరనుంచి చచ్చేదాకా చదువులకోసం ఉద్యోగాలకోసం పదవులకోసం ఆస్తులకోసం సౌకర్యాలకోసం
కీర్తులకోసం —- మనుషులను తరుముతున్న దెవరు?
కెరీర్ కోసమనో విలాస సాధనాల కోసమనో జనం ఈవిధంగా పరుగులు తీయడంలో అర్ధమేమిటి?
అసలు ఈ కెరీర్ అనేదాన్ని ఎవరు కల్పించారు? ఈ విలాస సాధనాలు ఎవరు సృష్టించారు? ఈ ప్రజల
మధ్య వున్న అనుబంధాలను ఎవరు ఎవరు కలుషితం చేసారు? అదుపులేని సంపదలపట్ల అంతేలేని
సౌకార్యలపట్ల ప్రజల్ని వ్యామోహపరుచుతున్న దెవరు?
గుర్రపు వీపుమీద కూర్చుని గుర్రానికి వెదురు బొంగుకు కట్టిన గడ్డిబుంగ చూపిస్తూ పరుగు తీయుస్తున్నట్టు జనాన్ని పరుగులేట్టిస్తున్నది ఎవరు?
ఈ పరుగే ఈ పోటీయే ఇందులో గెలుపే ప్రజాస్వామ్యమని, మనవ స్వాతంత్ర్యమని ప్రచారం చేస్తున్నారు. మనవ సమూహాలను నమ్మిస్తున్నారు. నమ్మేట్టుగా బలవంతపరుస్తున్నారు.
జాతులను జాతులతో మతాలను మతాలతో దేశాలను దేశాలతో పోటిపెట్టి విడదీసి విడదీయటానికి దేన్నయిన నిర్లజ్జగా వాడుకుంటున్నారు. చిట్టచివరికి మనిషిని మనిషితో కలవకుండా విడదీస్తున్నారు.
ఏం సాధిస్తారు?
ఫ్రీ మార్కెట్ ని సృస్టిస్తారు. వ్యక్తి మాన ప్రాణాలతో సహా ప్రతిదీ సరుకుగా మారుస్తారు. మనుషులే సరుకులు!
మనుషులే వినిమయదారులు! ఒకచోట నువ్వు అమ్ముడుపోతావు! వేరొకచోట నీవే కొనుగోలుదారుడువు!
దీన్ని సృస్టిస్తున్నవాళ్ళు, దీన్ని అదుపు చేయగలమని ఆసిస్తున్నవాళ్ళు —- వాళ్ళు కూడా —-సరుకులే! వినిమయదారులే! వారి వారి మానసికరోగాలే….. అహమే ….. వారిని….. సరుకులుగా
వినిమయదారులుగా మారుస్తున్నాయి.
ఇలా మనుషుల్ని సరుకులుగా వినిమయదారులుగా మార్చే తంత్రంలోనే దాని నాశనానికి బీజం
కూడా దాగి వుంది.
ఈప్ర్హ్రీ మార్కెట్ మనిషికి తెగింపు ని నేర్పుతుంది. తెగింపుని నూరిపోస్తుంది. మనుగడకోసం తెగించిన
మనుషులు చిట్టచివరికి తెగనమ్ముకోటానికయినా తెగనరకడానికయినా సిద్ధపడతారు. అందరూతమని తాము అమ్ముకోటానికి సిద్ధ పడితే మాత్రం అవసరాలన్నీ తీరతాయా? అవసరాలన్నవి తీరిపోతుంటే అమ్ముకోటానికి ఎవరు సిద్ధపడరు గదా! అవసరాలు సృష్టిస్తూ తీర్చీ,తీర్చకుండా ఉంచుతూ విస్తరించే ఈ ఫ్రీమార్కేట్– తమ అవసరాలు తీర్చగలిగేది కాదన్న వాస్తవం గ్రహించిన రోజున, తెగింపుకు అలవాటయిన మానవ సమూహాలు దానిని నాశనం చేయడానికి ఏమాత్రం వెనకాడవు. పైపెచ్చు అది వాటికి చిటెకలో పని.

జీవితం............ జ్ఞానం...

అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ
ఓం శాంతి శాంతి శాంతి

అసతోమా సద్గమయ
అశాశ్వతం నుంచి శాస్వతానికి
అసత్యం నుంచి సత్యానికి సాగుదాం

తమసోమా జ్యోతిర్గమయ
తిమిరం నుంచి ప్రకాశానికి సాగుదాం
మృత్యోర్మా అమృతంగమయ
మృత్యువు నుండి అమృతానికి సాగుదాం.

అన్యేషణం---- సత్యాన్వేషనయే జ్ఞానం
శాశ్వత సత్యం కోసం పయనమే జ్ఞానం
ప్రకాశం కోసం పయనమే జ్ఞానం
అమృతాన్ని వెదుకుతూ సాగడమే జ్ఞానం
అన్వేషనమే జ్ఞానం.
జ్ఞానమే అన్వేషణ!
అన్వేషనమే జీవితం.
జీవితమే అన్వేషణ!
అయితే
అన్వేషణ అన్వేషణ కొరకేనా?
కాదు
సత్యం కొరకు అన్వేషణ.

న్యాయం :

మార్జాల కిషోర న్యాయం .......
పిల్లి తన పిల్లలను మునిపళ్ళతో పట్టుకొని తీసుకుపోతుంది. ఇందులో పిల్లి పిల్ల (కిషోర మార్జాల )
భాద్యత ఏ మాత్రం లేదు. భాద్యత అంతా తల్లి పిల్లిదే.

మర్కట కిషోర న్యాయం:
కోతిపిల్ల తల్లి కడుపును కరచి తన నాలుగుకాళ్ళతో గట్టిగా పట్టుకుంటుంది, వదలదు.
తల్లికోతి బిడ్డను పట్టుకోదు. ఇక్కడ భాద్యత అంతా కోతి పిల్లదే ( కిషోర మర్కటానిదే ) తల్లి భాద్యత లేదు.

Saturday, June 19, 2010

మేకలు--పులులు

మేకల ప్రయోజనాలు పులులు తీర్చుతాయంటారా!
తీర్చటం సంఘతేమో కాని
కదతేర్చటం మాత్రం ఖాయం.

సమర్ధుడు

""ఆగ్నానువర్తియై (విధేయుడు అయి) నడుచుకోనువాడే ఆజ్ఞాపించ సమర్ధుడు.""

ఎదుటివారి సొమ్ము

పాల సాగరమున పవ్వలించినస్వామి
గొల్ల ఇండ్ల పాలు కోరనేల
ఎదుటివారి సొమ్ము ఎల్లవారికి తీపి
విశ్వధాభిరామ వినుర వేమ!

కొందరు చెవులతో వింటారు.
కొందరు పోట్టలతో వింటారు.
కొందరు జేబులతో వింటారు.
మరి కొందరు విననే వినరు.

భాష---- చైతన్యం

చైతన్యంలో భాష ప్రధానాంగం
భాష చైతన్యానికి పునాది
చైతన్యం భాషకు భవనం
చైతన్యం వాలెనే భాష కూడా
అవసరం నుంచి పుడుతుంది
ఇతరులతో సంబందాల అవసరం
నుంచే భాష, చైతన్యం పుడతాయి.

వర్గ చైతన్యానికి, భాషకి చాలా శాస్త్రీయ మైన సమీప సంబంధం వుంది.
భాష---- ఆచరణాత్మక చైతన్యం.(practical consciousness)

పోటీ ప్రపంచం

ప్రపంచం మొత్తం పోటిమీదే ఆదారపడి నడుస్తోంది.
మనకంటే బలహీనుడు మన చెయ్యి ధాటి పోకుండా
అట్లాగే మనం మనకంటే బలవంతుడికి చిక్కకుండా
ఉండటమే పోటీలో ప్రదానం.

యుద్ధాలు జరిగితే చచ్చిన వాళ్ళు కీర్తిని
సంపాదిస్తే బతికిన వాళ్ళు రాజ్యాలను ఏలారు.

పాముకు అందకుండా తప్పించుకున్న కప్పలు
తమ వంశాన్ని వృద్ధి చేసుకున్నాయి.

పొగడ్త

పొగడ్త పైకి తీసుకుంటే చొక్కాకి రాసుకున్న
అత్తరు లాగ వుంటుంది.
అదే లోనికి తీసుకుంటే విషం లాగ పనిచేస్తుంది.
....................

గజ్జి గోకితే పోదు
మూలానికి మందు వేయాలి.

ధైర్యం

వయస్సు ముదిరితే ముఖం ముడతలు పడుతుంది.
చొరవ, ఉత్సాహం, వదలివేస్తే
మనస్సు ముడుచుకుపోతుంది.


జీవితం, మృత్యువు ఒకే నాణేనికి
బొమ్మా, బొరుసు వంటివి.

మరణించడానికి కాదు జీవించడానికే
ధైర్యం కావాలి.

మద్యం

పెద్దపులి కన్నా భయంకరమైనది మద్యం.
మద్యం మనిషిలోకి వెళ్లి వివేకాన్ని బయటకి నెట్టివేస్తుంది.
..............
త్రాగుడువల్ల తమ జీవితాలను నాశనం చేసుకున్నవారికన్నా
తమ నికృష్ట జీవితం కారణంగా త్రాగుడును అలవాటు చేసుకొన్న
వారి సంఖ్యే చాల చాల ఎక్కువ.
............
తాగుబోతు తో వాదం మూర్ఖునితొ స్నేహం
ఎవరికీ మంచిది కాదు.

వేమన

కులము గలుగువారు గోత్రము కలవారు
విద్యచేత విర్రవీగువారు
పసిడి గల్గువాని బానిసకొడుకులు
విశ్వదాభిరామ వినురవేమ.

చాకి కోక లుదికి చీకాగు పడజేసి
మైల దీసి లెస్స మడిచినట్లు
బుద్దిచెప్పువాడు గ్రుద్దితే మేలయా
విశ్వదాభిరామ వినురవేమ.

నారదుడు --- కృష్ణుడు

నాయ శరగ సార విరయ
తాయన జయసార సుభగ ధర ధీనియమా
మాయనిధీ రధగ భసుర
సాయ జనయ తాయర విర సాగర శయనా
ఈ కంద పద్యం ముక్కు తిమ్మన వ్రాసిన పారిజాతాపహరణం లోనిది. విసిస్టత ఏమంటే పద్యంలో 52
అక్షరాలున్నాయి. సన్నివేశం నారదుడు కృష్ణుడిని పొగుడుచున్నాడు.
అయితే ఈ పద్యాన్ని ముందు నుంచి చదివిన వెనకనుంచి చదివిన ఒకేలా వుంటుంది.
అక్షరాలన్నీ అదేక్రమం గమనించండి.
దీన్ని ఇంగ్లీష్ భాష లో palindromes అంటారు. తెలుగులో ముందు నుంచి చదివిన వెనుకనుంచి
చదివిన ఒకేలా కన్పించే పదాలంటారు.
ఉదా: సిరాతో రాసి నటన మడమ పులుపు నంద సదనం మీసాలాసామీ!
కునుకు వినమని మనవి కడువేడుక జలజ వికటకవి కిటికి
ఇంగ్లీష్ లో "doc, note I dissent. A fast never prevents a fatness. I diet on cod "
rotator, nurses run

Friday, June 18, 2010

స్వర్గంలో సూత మహర్షి

త్రిపురనేని వారి సూతమహర్షి ఒక రోజు స్వర్గాన్ని చూడటానికి వెళ్లారు. స్వర్గం అంటే విట విటీ నటీ నట పరివేస్టితం గదా! అక్కడ పసిపిల్లలు కనిపించరేమిటి? అనే అనుమానం మహర్షికి కలిగింది. నివృత్తి
కోసం అచ్చట జవారాలినోకరిని సూతమహర్షి ------
ఇందరు యువతీ యువకులు
క్రందుగా నున్నట్టి చోట కన్పించరహో
చిందులు తెగ ద్రోక్కెది కసి
గందులు వచిఇంపుమమ్మ కారనమన్నన్?

సూతమహర్షి చాల గడుసుగా అడిగాడనుకుంటే అంతకంటే గడుసుగా వుంది ఆ జవరాలి జవాబు

స్వైరవిహార నిష్టమోయి సర్వదిగంతర దివ్యదేశ సం
చారముజేయు మాకు గ్రహచారము చాలక
సంతుగల్గినన్
వారలనెల్ల గన్న మగవారికి నిత్తుము కాని పెంచు నా
చారములేదు స్వర్గమున సత్యము జెప్పితినంచు
నామెయున్.

Thursday, June 17, 2010

బలహీనం

శారీరకంగా బలహీనంగా వున్నప్పుడు వయస్సు -------
ఆర్ధికంగా బలహీనంగా వున్నప్పుడు అప్పు ఫై వడ్డీ
త్వరితంగా పెరుగుతాయి.
అంతేకాదు
శారీరకంగా మీదు మిక్కిలి బలిష్టంగా వున్నప్పుడు వయస్సు
ఆర్ధికంగా పటిష్టంగా వున్నప్పుడు కూడా వడ్డీ వయసు
త్వరితంగా పెరుగుతాయి.అయితే ఇక్కడ గౌరవాన్ని గుర్తింపును
తెస్తాయి పైన పేర్కొన్న పరిస్థితుల్లో పోతాయి.

మరగుజ్జులు

మరుగుజ్జు మనస్తత్వం గలవాళ్ళు మహాత్వాన్ని ( ఔన్నత్వాన్ని ) కొలవలేరు.
దివాందులు సూర్యరస్మిని చూడలేరు.

టంగుటూరు ఆవాలు

చెప్పేవాడికి చాదస్తమున్నా వినేవాడికి వివరం ఉండవద్దా?
టంగుటూరు లో ఆవాలు తాటికాయంత లావు వుంటాయంటే
బుద్ధి వున్నవాడు ఎవడయినా నమ్ముతాడా?

పొదుపు ----- ఖర్చు .

సంసారానికి పొదుపు ఖర్చుకు అదుపు వుండాలి.

శ్రీనాధకవి

దాహం దాహం అని కేక వేస్తే ఎవరు చెప్పుకుంటారు.
తిరిపెమున కిద్దరాండ్రా పరమేశా! గంగ విడువు
పార్వతి చాలున్. అనడం నుండే శ్రీనాధుడు కవి అయ్యాడు
---- కొడవటిగంటి

ధనం ---- మనిషి

ధనం మనిషిని మార్చకపోతే ఆచ్చర్యపోవాలికాని మార్చితే ఆచ్చర్యం ఏం వుంది.
దరిద్రం స్నేహితులను పోగొట్టుతుంది. దరిద్రం పోయిన మీదట వచ్చే సంపద
ఆ పోయిన స్నేహితులను అందరిని శత్రువులుగా మారుస్తుంది.

పుస్తకాలు --- జీవితం

పుస్తకాలు చదివి నిజంగా ఆనందం పొందేవానికి జీవితం కూడా బాగా తెలియాలి.

Wednesday, June 16, 2010

శ్రమదోపిడి !

" అదనపు విలువ అపహరనే దోపిడీ."
ఏ యజమాని అయిన కార్మికునితో మేదోకార్మికునితోసయితం ఎక్కువ శ్రమ చేయిన్చికుని తక్కువ శ్రమకు
మాత్రమే వేతనం చెల్లిస్తాడు. ఈ విధంగా వేతనం చెల్లించని శ్రమ విలువ అపహరననే దోపిడీ అంటారు.

తులసి

తులసి వనంలోని గంజాయి మొక్కను తొలగించడం సులభమే . కాని గంజాయి వనం లోని తులసి మొక్కను కాపాడుకోవడమే కష్టం. ఏమంటారు?

ఉపాధి --- సమాజానికే మేలు

ఉద్యోగం మనిషికి ఉపాధిని, ఆరోగ్యాన్ని కల్పిస్తుంది. సహనం అబ్బిస్తుంది. నీతికి నియమానికి దారి
చూపెడుతుంది. నిరంతరం ప్రజలకు ఉపాది కలిపించడంవల్ల, శ్రమకు తగిన జీతం ఇవ్వడం వల్ల
సమాజానికి సర్వత్ర సంపద, సంతృప్తి, సంతోషం సంప్రాప్తిస్తాయి. ఏమంటారు?

Tuesday, June 15, 2010

అసమర్ధుని ఆత్మవిమర్శ.....

తరచూ ఆత్మవిమర్శ పేరుతో తమ అసమర్ధతను విమర్సించుకొంటు ఉండేవారిలో ఆత్మవిశ్వాసం క్షీణిస్తుంది.
చివరకు వారు ఏ చిన్న నిర్ణయం తీసుకోలేక ఊగిసలాట మనస్తతత్వం ప్రదర్చిన్చుతారు.
ఉద్రేక ఉద్వేగాలకు లోనయినప్పుడు విషయ నిర్నాయిక శక్తి కుంటుపడుతుంది.
కోపంలోవున్న మనిషి పంచేంద్రియాలు అందించే సమాచారాన్ని మెదడు సద్వినియోగం చేసుకోదు.
అందువల్ల ఆ పరిస్థితుల్లో ఏదయినా సమస్యను పరిష్కరించుకోవటానికి ప్రయత్నిస్తే గుడ్డిగా ప్రవర్తిస్తారు.
సమస్యను అన్ని ద్రుక్కోనాలనుండి పరిశీలించినప్పుడు సమగ్రంగా అవగాహనా చేసుకోవడానికి వీలు కలుగుతుంది. సమస్యను సమగ్ర పరిశీలనా చేయకుండా ఒక్క దృక్కోణం నుండి మాత్రం పరిశీలించి పరిష్కరించడానికి పయత్నిస్తే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం వుంది. అట్లా అని ప్రతి
చిన్న సమస్యను అతిగా విశ్లేషిస్తే అమూల్యమయిన కాలాన్ని నష్టపోయే ప్రమాదముంది.
అతి ప్రాముఖ్యం గల సమస్యలకు సమగ్ర పరిశీలన అవసరం
సాదారణ సమస్యలకు సత్వర నిర్ణయాలు అవసరం. కాదని సమగ్ర పరిశీలన నెపంతో కాలయాపన చేయటం కాలాన్ని నష్టపోవడం మాత్రమె కాదు. సమస్యను కుడా జటిలం చేయటం అవుతుంది.జాగ్రత్త.
.

Sunday, June 13, 2010

కంటి కి ఒకపొర కప్పేదే అధికారం...

తనమేలు కోరుకునే వాడు ఎవడూ ధన మదాంధులకు నీతులు చెప్పడు.
ధనం, అధికారం ఉన్నవాడు తానుతలచేది, చెప్పేది చేసేదీ, సరైనధనుకుంటాడు.
అది మంచిది కాదని చెప్పేవాడిని పిచ్చివాడనుకోవదమో, పగ వాడనుకోవదమో
జరిగి అట్లా చెప్పిన వాడిని పగపట్టి అంతం చేయడానికి ప్రయత్నిస్తారు.
అధికారం కంటికి ఒకపొర కప్పేస్తుంది.-- అది వాస్తవం చూడనివ్వదు
తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటుంది.
అధికారి ఎవరన్నా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటే అది విన్నవారు
వెంటనే ప్రభూ! మూడు కాళ్ళతో ఆహ ఆ కుందేలు ఎంత బాగా గెంతుతుందండి!
అంటే ఆ అధికారికి (ప్రభువు) బాగా నప్పుతుంది.-- తెలిసిందిగా తెలివిగా నడచుకోండి.

చాటున తిట్టటం వద్దు

అనేది ఏదయినా ఎదుటవారి మొహం మీదే అనేయటం మంచిది.
ఎదుట నోరునొక్కుకుని చాటున తిట్టం కన్నా.....
కొంతమంది మొహమ్మీద ఏమి అనరు మౌనం పాటిస్తారు. ఆ మౌనం ఓ
నటన-- కుళ్ళిన కోడిగుడ్డు పైకిఅంత నునుపు నిగనిగ ఉన్నట్టు
ఇహ లోపల ముక్కుమూసుకోవలసిందే!

శాస్త్రానికి అజ్ఞాత విషయాలే కానీ అతీత విషయాలు వుండవు.

శాస్త్రానికి ( సైన్సు ) అజ్ఞాత విషయాలు ఉంటాఎకాని అతీత విషయాలు ఉండవు.
సైన్సుకి తత్వశాస్త్రం అతీతం కాదు.
సైన్సు పరిశోధనలవల్ల వచ్చే ఫలితాలవల్ల తత్వశాస్త్రం పునాదులే కదలిపోయే అవకాశంవుంది
హేతువు మీద ఆధారపడి పరిశోధనలతో పురోగమించేదే శాస్త్రం (సైన్సు)
శాస్త్రం (సైన్సు) కు ముగింపు లేదు.
ఏ శాస్త్రం అయినా జడప్రాయం కాగూడదు. సేంద్రియ పదార్ధం లాగ ఎదగాలి పెరగాలి విస్తరించాలి వికసించాలి.
మిత్రులారా! తర్కం కన్నా జీవితం విశాలమయినది.

లాల్ సలాం! లాల్ సలాం! లాల్ సలాం!

కొమరం భీం - - అల్లం రాజయ్య మరియు శనిగరం వెంకటేశ్వర్లు (సాహు ) ఒక తెలుగు చారిత్రకనవల కొన్ని వాక్యాలు .
భీం యెట్లా చనిపోతాడు. భీం అంటే మనిషా? భీం అంటే ఒక్కడా?భీం అంటే .పన్నెండు గ్రామాలు . భీం అంటే గొండుజాతి, భీం అంటే గొండిస్తాన్, భీం అంటే పోడుకొట్టే ప్రతిరైతు, భీం అంటే అంతేలేని ఆకాశం. భీం అంటే నేల. భీం అంటే అడవి. భీం అంటే జలజలపారే యేరు.......... ఒరేయ్! భీం అంటే లడాయి. భీం అంటే తుడుం మోత. అరేయ్!భీం అంటే తుటుకొమ్మ మోత..... అవును భీం అంటే ఎగిరే రగల్జెండా. భీం యెట్లా చస్తాడు? భీం అంటే పేలే బర్మారు.... వెలిగే దునికిరీ. ఎవడురా భింను చంపేది? ఎలచంపుతడుర భింని?
అరేయ్? నిజాం సర్కారే కాదు తెల్లోడు కూడా కలిసిన రాజ గోండు భీం ను చంపటం కాదుకదా భీం వెంట్రుక,
వెంట్రుక కూడా పీకలేరు. కొమరం భీం గోండు జాతికి చెందినా గిరిజన గొరిల్ల పోరాట యోధుడు. నిజాం సర్కారుకు బ్రిటిష్ సామ్రాజ్యానికి కలిపి సవాల్ విసిరిన గిరిపుత్రుడు. భిర్సాముండా లాంటి వీరుడు. సలాం.సలాం.వీరులందరికీ వందనాలు.





అక్షరం

అక్షరం అంటే క్షరం కానిది ( నశింపు లేనిది ) అని అర్ధం.
చదువు అంటే తెలుసుకోవడం అని అర్ధం.

విజయం

లక్ష్యాన్ని మరిచిపోకపోవడమే విజయానికి గొప్ప సంకేతం._____ బెంజిమిన్ డిజ్రేలి.

Saturday, June 12, 2010

శ్వాస --- భాష ....

మనిషికి శ్వాస ఎలాంటిదో భాషకి యాస అలాంటిది.

వూగుతున్న గోడను చూస్థున్న రాజుగోరు..

చరిత్రలో ఒక రాజుగోరు పక్కనున్న వారితో ఆ గోడ వూగుతోంది చూసారా ? అన్నాట్ట ఆపక్కన ఉన్నవారు మహాప్రభో! గోడ ఉయ్యలలా వూగుతోంది అన్నారట. కాని ఒక బాటసారి ఇది అంతా విని మహాప్రభో వీరంతా మిమ్ములను పిచ్చివారిని చేస్తున్నారు. గోడ ఊగడం లేదు అంతేకాదు గోడ ఉగదు అనికూడా అన్నాట్ట అంతే ఆప్రభువుకు పిచ్చికోపంవచ్చ్చింది వెంటనే బటుడిని పిలిచి వీడి తల తీసి గుమ్మానికి వేలాడేయమని ఆజ్ఞాపించాడు ఆ మహారాజుగోరు. అలావుంటుంది అధికారంలోవున్నవారిచిత్తం. అందుకే అధికారంలో ఉన్నవారికి ధన కుల మదాంధులకు సామాన్యులు సలహాలు ఇవ్వకూడదు కాక ఇవ్వకూడదు.