బాధితుల్నే నేరస్తులుగా చిత్రీకరించే వ్యవస్థను ప్రతిబింభించే
పాట తెలంగాణా పల్లెల్లో పిల్లలు దూల అనే ఒక సాంస్కృతిక
రూపకం లో పాడుతుంటారు.
దున్నపోతు! దున్నపోతు!
దుక్కేందుకు దున్నలేదు?
పాలేరు కాడి కట్టందే
దుక్కేట్లా దున్నేది?
పాలేరు!పాలేరు!
కాడెఎందుకు కట్టలేదు?
దొరజీతమియ్యలె
అందుకే దుక్కికాడికట్టలే
దొర! దొర! జీతం ఎందుకీయలేదు?
సోలలేందే నేనెట్ల కొలిచేది?
సోల! సోల! ఎందుకు లేవు?
వడ్లాభక్తుడు చేయందే
నేనెట్ల వుంటాను?
వడ్లాభక్తుడా! వడ్లాభక్తుడా!
సోల నెందుకు చెక్కలా?
బాడిసె చేక్కందే
నేనేం చేసేది?
బాడిసె! బాడిసె! ఎందుకు
చెక్కలేదు?
కమ్మరోడు సరవందే
నన్నెట్లా చెక్కమంటావు?
కమ్మరోడా! కమ్మరోడా!
బాడిస నెందుకు సరవలేదు?
తిత్తి ఊదన్దె నేనెట్లా సరిసేది?
తిత్తీ! తిత్తీ!ఎందుకు
ఊదలేదు?
దున్నపోతు చావందే
నన్నేం చేయమంటావు?
వక్రబుద్ధి కత్తికి రెండు అంచులా పదును వుంటుంది. గుర్తుంచుకోండి.
No comments:
Post a Comment