Thursday, June 24, 2010

డాక్టర్. వి.లక్ష్మణరెడ్డి—-అధ్యాపక శ్రామికుడు.

నిరంతర అధ్యయనం చేయందే అధ్యాపక ఉద్యోగానికి అర్ధం లేదనే భావనతో, నిరంతరం అధ్యయనం చేస్తూ
అధ్యాపక వృత్తికే వన్నె తెచ్చి వయసురీత్యా ఉద్యోగ విరమణ చేసి అధ్యయనాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్న
డాక్టర్.వి.లక్ష్మణ రెడ్డి గారు నాకే కాదు మా తరానికే స్పూర్తి ప్రదాత.
డాక్టర్.లక్ష్మణ రెడ్డి గారు బుద్దవరం వి.కే.ఆర్.కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా పని చేసి పదవీ విరమణ చేసారు. ముఖ్యంగా డాక్టర్. రెడ్డి గారు పదవీ కాలంలో పాఠం చెప్పే విధానం,ఉచ్చారణ,విశ్లేషణ,
ఉపన్యాస సరళి విద్యార్ధులుగా మమ్ముల్ని ఎంతగానో ఆకట్టుకొనేది.రెడ్డి గారు పాఠం చెప్పేటప్పుడు విన్న
ఏ విద్యార్ధి కూడా తిరిగి ఆ పాఠం చదవ వలసిన అవసరం లేకుండానే పరీక్షలు వ్రాయగలిగేవారు.
మా రెడ్డి గారు పాఠంతో పాటు సామాజిక,రాజకీయ,ఆర్ధిక,సాంఘిక,సాంస్కృతిక,సమకాలీన,
విషయాలను కలగలిపి, రంగరించి,వివరించి,విశ్లేషించి మా నాలెడ్జిని అప్టుడేట్ చేసేవారు. ముఖ్యంగా మా
మాస్టారి భోధనా విధానం మిత్రులుతో ముచ్చటిస్తున్నట్లు ఉండి పాఠం ఉపదేశం వలె గాక ఆలోచన రేపే
విధంగా ఉండేది.ఆ ధోరణి మా అధ్యయనానికి, మా వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడి ,మాలో ఆలోచన, అన్వేషనాసక్తిని రేకెత్తించేది.
మా లక్ష్మణ రెడ్డి గారు తన పదవీ కాలంలో ఎందరో నరసింహాలను నరులుగా, మానవత్వం వున్న మానవులుగా, ఎందరో హనుమంతులను సద్యోజనిత చైతన్యవంతులుగా ( వెదురు బొంగును వేణువు గా మార్చినట్లు) మలచిన వాస్తవిక అధ్యాపక కార్మికుడు. గన్నవరం ప్రాంతంలో జనం అందరికి సుపరిచితులయిన మా డాక్టర్.వి.లక్ష్మణ రెడ్డి గారిలో చొరవ పాలు హెచ్చు. మిత్రులారా! మీలో ఎవరికైనా ఆసక్తి వుంటే మా మాస్టారిని ౦౪౦-౩౧౫౦౯౫౪ లో హలో చెప్పి నడుస్తున్న సమకాలీన వివాదాస్పదం కాని విషయాలు మాట్లాడి మీరే గ్రహించగలరు.

No comments:

Post a Comment