పుట్టిన దగ్గరనుంచి చచ్చేదాకా చదువులకోసం ఉద్యోగాలకోసం పదవులకోసం ఆస్తులకోసం సౌకర్యాలకోసం
కీర్తులకోసం —- మనుషులను తరుముతున్న దెవరు?
కెరీర్ కోసమనో విలాస సాధనాల కోసమనో జనం ఈవిధంగా పరుగులు తీయడంలో అర్ధమేమిటి?
అసలు ఈ కెరీర్ అనేదాన్ని ఎవరు కల్పించారు? ఈ విలాస సాధనాలు ఎవరు సృష్టించారు? ఈ ప్రజల
మధ్య వున్న అనుబంధాలను ఎవరు ఎవరు కలుషితం చేసారు? అదుపులేని సంపదలపట్ల అంతేలేని
సౌకార్యలపట్ల ప్రజల్ని వ్యామోహపరుచుతున్న దెవరు?
గుర్రపు వీపుమీద కూర్చుని గుర్రానికి వెదురు బొంగుకు కట్టిన గడ్డిబుంగ చూపిస్తూ పరుగు తీయుస్తున్నట్టు జనాన్ని పరుగులేట్టిస్తున్నది ఎవరు?
ఈ పరుగే ఈ పోటీయే ఇందులో గెలుపే ప్రజాస్వామ్యమని, మనవ స్వాతంత్ర్యమని ప్రచారం చేస్తున్నారు. మనవ సమూహాలను నమ్మిస్తున్నారు. నమ్మేట్టుగా బలవంతపరుస్తున్నారు.
జాతులను జాతులతో మతాలను మతాలతో దేశాలను దేశాలతో పోటిపెట్టి విడదీసి విడదీయటానికి దేన్నయిన నిర్లజ్జగా వాడుకుంటున్నారు. చిట్టచివరికి మనిషిని మనిషితో కలవకుండా విడదీస్తున్నారు.
ఏం సాధిస్తారు?
ఫ్రీ మార్కెట్ ని సృస్టిస్తారు. వ్యక్తి మాన ప్రాణాలతో సహా ప్రతిదీ సరుకుగా మారుస్తారు. మనుషులే సరుకులు!
మనుషులే వినిమయదారులు! ఒకచోట నువ్వు అమ్ముడుపోతావు! వేరొకచోట నీవే కొనుగోలుదారుడువు!
దీన్ని సృస్టిస్తున్నవాళ్ళు, దీన్ని అదుపు చేయగలమని ఆసిస్తున్నవాళ్ళు —- వాళ్ళు కూడా —-సరుకులే! వినిమయదారులే! వారి వారి మానసికరోగాలే….. అహమే ….. వారిని….. సరుకులుగా
వినిమయదారులుగా మారుస్తున్నాయి.
ఇలా మనుషుల్ని సరుకులుగా వినిమయదారులుగా మార్చే తంత్రంలోనే దాని నాశనానికి బీజం
కూడా దాగి వుంది.
ఈప్ర్హ్రీ మార్కెట్ మనిషికి తెగింపు ని నేర్పుతుంది. తెగింపుని నూరిపోస్తుంది. మనుగడకోసం తెగించిన
మనుషులు చిట్టచివరికి తెగనమ్ముకోటానికయినా తెగనరకడానికయినా సిద్ధపడతారు. అందరూతమని తాము అమ్ముకోటానికి సిద్ధ పడితే మాత్రం అవసరాలన్నీ తీరతాయా? అవసరాలన్నవి తీరిపోతుంటే అమ్ముకోటానికి ఎవరు సిద్ధపడరు గదా! అవసరాలు సృష్టిస్తూ తీర్చీ,తీర్చకుండా ఉంచుతూ విస్తరించే ఈ ఫ్రీమార్కేట్– తమ అవసరాలు తీర్చగలిగేది కాదన్న వాస్తవం గ్రహించిన రోజున, తెగింపుకు అలవాటయిన మానవ సమూహాలు దానిని నాశనం చేయడానికి ఏమాత్రం వెనకాడవు. పైపెచ్చు అది వాటికి చిటెకలో పని.
No comments:
Post a Comment